రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ రిలే దీక్షలు ప్రారంభం
- EDITOR

- Aug 6
- 1 min read
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ రిలే దీక్షలు ప్రారంభం
జగన్ ఆదేశాలతో ప్రొద్దుటూరు నుంచి తొలి దీక్షకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలకు శ్రీకారం చుట్టింది. మొదటి రోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. స్థానిక మునిసిపల్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదురుగా నిర్వహించిన ఈ దీక్షకు ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ అధ్యక్షత వహించారు. సోములవారిపల్లె పంచాయితీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
DSCలో జరిగిన అక్రమాలపై CBI విచారణ జరిపించాలని, దానికి కారణమైన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని దీక్షలో డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయల భృతి ఇవ్వాలని వారు నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించిన నాయకులు, ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.





Comments