ఫామ్ - 7 ద్వారా వైసిపి ఓట్లను తొలగిస్తున్నారు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
- VOICE OF HERALD

- Jun 16
- 1 min read
ఫామ్ - 7 ద్వారా వైసిపి ఓట్లను తొలగిస్తున్నారు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ జాబితా నందు మార్పులు చేర్పులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారని అయితే ప్రారంభమైన మొదటి రోజునే కొన్ని సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటేనని అలాంటి ఓటును నేడు కాపాడుకునే దుస్థితి ప్రజలకు ఏర్పడిందని ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నందు అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ, గతంలో ఓటరు పాలకుడిని ఎన్నుకునేవాడని కానీ నేడు ఓటర్లను పాలకుడు ఎన్నుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పారదర్శకంగా జరగవలసిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ లెక్కింపు జాబితా టిడిపి నాయకులు అధికారులను అడ్డం పెట్టుకుని అన్ని పార్టీల బి ఎల్ ఏ లకు సమాచారం ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ బిఎల్ఎ లకు సమాచారం ఇచ్చి ఓటరు లెక్కింపు ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులను ఫామ్-7 ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ, నాడు ఈవీఎం ఓటింగ్ ద్వారా 2024 ఎన్నికలలో ఓటమి చెవిచూసిన తాను రానున్న ఎన్నికలలో ఎస్ ఐ ఆర్ కారణం కావచ్చు అని జోష్యం చెప్పారు. కేవలం తమ పార్టీ ఓటర్లను తొలగించడానికి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను కూటమి నాయకులు వాడుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటానికి ఉపయోగపడే ఏ ప్రభుత్వమైనా ఉద్యోగి అయినా జైలు జీవితానికి అంకితం కావలసి ఉంటుందని హెచ్చరిస్తూ, నెల రోజులు జరగబోయే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విధి విధానం నందు వైసిపి నాయకులు జాగ్రత్త వహించి తమ పార్టీ ఓటర్లను కచ్చితంగా గుర్తించే ప్రయత్నం చేయాలని, అలాగే ఓటర్లు కూడా తమ ఓటును సరిచూసుకొని భద్రపరచుకోవాలని కోరారు.




Comments