top of page

వైకాపా నాయకులే హత్య చేశారు - మృతుడి తల్లి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 25, 2022
  • 1 min read

వైకాపా నాయకులే హత్య చేశారు - మృతుడి తల్లి

వైకాపా నాయకులే తన ఒక్కగానొక్క బిడ్డను హత్య చేశారని మృతుడి తల్లి నిర్మలాదేవి ఆరోపిస్తున్నారు. భూమి వ్యవహారంలో గతంలో తన కుమారుడు సురేష్ నాయుడుకి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వైకాపా నాయుడు కి మధ్యన తగాదాలు ఉండేవని తెలిపారు. ఈ వ్యవహారంలో తనను వారు ఎప్పుడైనా హత్య చేయవచ్చునని పలుమార్లు తన కుమారుడు తనతో చెప్పేవాడని తెలిపారు. రాత్రి సమయంలోనే తన కుమారుడిని హత్య చేసి ఉంటారని, మోకాళ్ళ లోతు కూడా లేని సంపులో తనను పడవేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులకు వివరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page