top of page

యాత్ర 2 షూటింగ్ సందడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 15, 2023
  • 1 min read

యాత్ర 2 షూటింగ్ సందడి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరులో యాత్ర 2 షూటింగ్ సందడి నెలకొంది, ఆదివారం ఉదయం 11 గంటల నుండి ప్రొద్దుటూరు ముఖ్య కూడళ్ళ లో షూటింగ్స్ సన్నివేశాలు డైరెక్టర్ చిత్రీకరించారు. నటుడు జీవ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి యాత్ర 2 అని నామకరణం చేయగా, ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2018 నాటి పాదయాత్రకు సంబంధించిన చిత్రంగా తెలియ వస్తుంది. యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 చిత్రాన్ని చిత్రీకరించుతున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. నటుడు జీవా ని చూడటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా, జగన్ అభిమానులు తమ నాయకుని పాత్రను పోషిస్తున్న నటుడు జీవాను చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చి షూటింగ్ సన్నివేశాలను ఆసక్తిగా తిలకించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page