top of page

ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 19, 2022
  • 1 min read

ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా... 25 కి.మీ దూరంలోని గోల్ఫ్‌ బంతి స్పష్టంగా గుర్తింపు

ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా... ఐదున్నర అడుగుల లెన్స్‌.. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్‌ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్‌ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు. ఈ డిజిటల్‌ కెమెరా 3,200 మెగాపిక్సెల్‌ సామర్థ్యం కలిగి ఉంది. రాత్రి వేళల్లో ఖగోళ చిత్రాలను కచ్చితత్వంతో చిత్రీకరించడం కోసం దీన్ని తయారు చేస్తున్నారు. దాదాపుగా పూర్తైన ఈ కెమెరా ఫొటోలను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.

ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై కూర్చొబెడతారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పా రు. ఆకాశంలో రాత్రి వేళల్లో జరిగే అద్భుతాలు, రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాధారణంగా మనం దిగే ఫొటోలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో.. ఈ కెమెరా ఫొటోలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారుు. కెమెరా ముందుభాగంలో ఉండే అద్దం 27 అడుగులు ఉంటుంది. అంటే టెన్నిస్‌ సింగిల్స్‌ కోర్టు సైజులో ఉంటుంది. 189 సెన్సర్లు కలిగి ఉంటుంది. 2800 కిలోల బరువు ఉంటుంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page