top of page

వరల్డ్ బ్యూటీ కాస్మోటాలజి ఐకాన్ అవార్డు దక్కించుకున్న కాస్మోటాలజిస్ట్ సుజిత ఆవుల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 31, 2024
  • 1 min read

వరల్డ్ బ్యూటీ కాస్మోటాలజి ఐకాన్ అవార్డు దక్కించుకున్న కాస్మోటాలజిస్ట్ సుజిత ఆవుల

హీరో విశాల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సుజిత

ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్యూటీషియన్ కోర్సులలో ఎంతోమందికి శిక్షణనిచ్చి చెన్నై వేదికగా డబ్ల్యూబిపిసి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కాస్మోటాలజిస్ట్ పోటీలలో ప్రొద్దుటూరుకు చెందిన సాయి హరిణి బ్యూటీ క్లినిక్ అధినేత సుజిత ఆవుల వరల్డ్ బ్యూటీ కాస్మోటాలజిస్ట్ మరియు అస్థెటిక్ ఐకాన్ అవార్డులను దక్కించుకుంది. డబ్ల్యూ బిపిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో సుమారు 18 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో భారతదేశానికి 5 ఐకాన్ అవార్డులు రాగా ప్రొద్దుటూరు కు చెందిన సుజిత ఆవుల కు ఐకాన్ అవార్డు రావడం కడప జిల్లా కే గర్వకారణం. ఐకాన్ అవార్డు దక్కించుకున్న సుజిత ఆవుల సినీ హీరో విశాల్ చేతుల మీదుగా ఐకాన్ అవార్డు అందుకుంది ఈ సందర్భంగా సుజిత ఆవుల మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయిలో డబ్ల్యూ బి పి సి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ కోర్సులలో కాస్మోటాలజిస్ట్ మరియు అస్థెటిక్ లలో తనకు ఐకాన్ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మిత్రులు శ్రేయోభిలాషుల మరింత ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరింత మందికి కోర్సులలో శిక్షణ నిచ్చి ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page