top of page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 24, 2023
  • 1 min read

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహం

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల పరిధిలోని వెంకట రాజంపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని హెచ్.పి పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాబడిన సమాచారం మేరకు డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి, రూరల్ సీఐ పుల్లయ్య, ఎస్సై భక్తవత్సలం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ కడప నగరానికి చెందిన ఎస్.కళావతి గా గుర్తించారు. ఇది హత్య, లేదా ఆత్మహత్య అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page