top of page

బ్యూటీపార్ల‌ర్ కి వెళ్లొద్ద‌న్న భ‌ర్త... ఆత్మహత్య చేసుకున్న భార్య...

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 29, 2023
  • 1 min read

బ్యూటీపార్ల‌ర్ కి వెళ్లొద్ద‌న్న భ‌ర్త...

ఆత్మహత్య చేసుకున్న భార్య...

బ్యూటీపార్ల‌ర్ కి వెళ్లొద్ద‌ని భ‌ర్త చెప్ప‌డంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది, వివరాల్లోకి వెళితే...

ఇండోర్ కు చెందిన రీనా యాదవ్ దారుణానికి పాల్పడింది, తన భర్త బలరామ్ యాదవ్ తో జరిగిన గొడవ కారణంగా తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. బలరామ్ యాదవ్ ఇంట్లోనే కుట్టుపని చేసుకుంటూ భార్య రీనా యాదవ్ తో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రీనా యాదవ్ బ్యూటీ పార్లర్ కు వెళతానని చెప్పగా.. బలరామ్ వద్దన్నాడు. దీంతో ఇరువురి మధ్య వివాదం రేగి, మాటా మాటా పెరిగి గొడవగా మారింది.

భర్త బలరామ్ తీరుతో మనస్తాపం చెందిన రీనా యాదవ్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ భార్య బయటకు రాకపోవడంతో బలరామ్ యాదవ్ తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా. అప్పటికే లోపల ఫ్యాన్ కు ఉరేసుకున్న రీనా యాదవ్ తనకు కనిపించింది. చుట్టుపక్కల వాళ్లను పిలిచి రీనాను కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని బలరామ్ యాదవ్ భోరున విలపించాడు.

పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రీనా యాదవ్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, బలరామ్ యాదవ్ ను ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page