top of page

భర్తను నరికి తలతో పీఎస్‌కు వెళ్లిన భార్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 20, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్‌ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది, అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి వెళ్లారు, హత్య జరిగిన తీరును పరిశీలించారు, అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page