భర్త నపుంసకుడు... కృష్ణా నది లో భార్య దీక్ష...
- VOICE OF HERALD

- Apr 26, 2022
- 1 min read
ఎన్.టి.ఆర్ జిల్లా, చందర్లపాడు మండలం, ఏటూరు
తన భర్త సంసారానికి పనికి రాడని తెలిసి తనకు పెళ్లి చేశారని ఆరోపిస్తున్న బాధితురాలు. చందర్లపాడు మండలం ఏటూరు కృష్ణా నది లో భార్య నిరసన దీక్ష. తనకు పెళ్లి అయిన మూడు రాత్రులు తన వద్ద కు రాకుండా ఉండటంతో అత్త మామలకు తెలిపితే తమ పరువు పోతుందని బయటకు చెప్పదని బెదిరింపు గురి చేశారంటున్న బాధితురాలు.
తనకు విడాకులు కావాలని అడగటం తో గ్రామ పెద్దలు సమక్షంలో తనకు 15లక్షలు ఇస్తానని ఒప్పుకున్న అత్త మామలు, చివరికు డబ్బు ఇవ్వక పోగా తమపై కోర్టు కు వెళ్ళి తమను ఇబ్బందులు గురి చేసి తమపై పరువు నష్టం వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు. తమకు న్యాయం జరిగే వరకూ కృష్ణా నది లో నీళ్ళు తాగి నిరసన చేపడుతామంటున్న బాధితురాలు, కుటుంబ సభ్యులు.
తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న నవ్యత


Comments