top of page

పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 9, 2022
  • 1 min read

ఊహించని షాక్ అంటే ఇదేనా..! పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి.. వీడియో చూస్తే వణకాల్సిందే

మృత్యువు ఏ రూపంలో కబళిస్తోందో ఎవ్వరూ చెప్పలేరు.. అప్పటివరకు నవ్వుతున్న వ్యక్తులు సైతం ఏదో ఒక రూపంలో చనిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో సరదాగా మరొక వ్యక్తితో మాట్లాడుతున్న టీటీఈకి కరెంట్ వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు.. ప్రస్తుతం అతను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన అందరినీ ఆందోళనకు గురిస్తోంది. కరెంట్ వైర్ ప్లాట్‌ఫాం మీదకు ఎందుకు ఉంది.. ప్రమాదం ఎలా జరిగింది అనే సందేహం చాలా మందికి రావొచ్చు.. కానీ ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ పక్షి గూడు కోసం పొడవైన వైర్‌ తీసుకెళ్తోంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చేరుకోగానే.. ఆ వైర్ హైవోల్టేజీ విద్యుత్‌ లైన్‌కు తగిలింది. ప్లాట్‌ఫామ్‌ అంచున నిల్చొని ఉన్న ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) కి ఆ వైర్‌ తాకింది. దీంతో టీటీఈ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్‌ఫామ్‌ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాలపై పడ్డాడు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page