top of page

13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jul 24
1 min read

13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన

ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బిజెపి నేత పర్లపాడు గౌరీ శంకర్
ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బిజెపి నేత పర్లపాడు గౌరీ శంకర్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణం 13వ వార్డులో ఓటర్ల జాబితా పారదర్శకత కోసం బూత్ స్థాయి అధికారులు (BLO లు) మరియు ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన మరియు దర్యాప్తు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా క్రింది కీలక అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేపట్టడం జరిగింది. చనిపోయిన ఓటర్లు ఎస్.ఐ.ఆర్. (SIR) ద్వారా వెరిఫై చేయబడి, మృతి చెందిన ఓటర్ల వివరాలను సేకరించి జాబితా నుండి తొలగించడం జరిగింది.


రెండు చోట్ల ఓట్లు - ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాలలో లేదా రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తించిన అప్లికేషన్లపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టడం జరిగింది. ఇల్లు మారిన ఓటర్లు - ప్రస్తుత అడ్రస్‌లో నివాసం ఉండకుండా వేరే ఊరికి లేదా ప్రాంతానికి శాశ్వతంగా షిఫ్ట్ అయిన ఓటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితా నుండి సవరించడం జరిగింది. ప్రతి ఇంటికి BLO ల సందర్శన, ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాధారాలు మరియు పకడ్బందీ దర్యాప్తు ద్వారా అర్హులైన నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, దొంగ ఓట్లు మరియు తప్పులను తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి ఈ నిరంతర కృషి చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా సరిచోసుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా సహకరించాలని భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి పర్లపాడు గౌరీ శంకర్ ఈ సందర్భంగా కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page