top of page

వాలంటీర్ సేవా గుణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 12, 2023
  • 1 min read

వాలంటీర్ సేవా గుణం

వాలంటీర్ గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివెంద్రం

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


కొత్తపల్లి పంచాయతీ కూడలి నందు ఉదయం వార్డు వాలంటరీ గోపి అధ్యక్షతన కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి మాట్లాడుతూ, నేడు కొత్తపల్లి పంచాయతీ కూడలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు పంచాయతీలో ప్రారంభించామని తెలియజేశారు, ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో చల్లటి మజ్జిగ, త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికి పట్టణంలో ఆరు చలివేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ గురు మోహన్, నరసింహులు, యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page