top of page

వినుకొండ పోలీస్ స్టేషన్ నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద విడుదల.

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 4, 2022
  • 1 min read

వినుకొండ పోలీస్ స్టేషన్ నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద విడుదల.

మాచర్ల నియోజకవర్గం లో వైసీపీ దుండగుల దాడి లో ప్రాణాలు కోల్పోయిన కంచర్ల జల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న బీద రవిచంద్ర ను పోలీసులు అరెస్ట్ చేసి వినుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. జల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీద రవిచంద్ర కు అనుమతి లేదన్న కారణం చూపి ఉదయం 8.30 గంటలకు అరెస్ట్ చేసిన వినుకొండ పోలీసులు రాత్రి 7.50 గం.లకు విడుదల చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న తనపై పోలీసులు అవలంభించిన వైఖరిను బీద తప్పు పట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page