కష్టపడిన కార్యకర్తకు దక్కిన గుర్తింపు: ప్రొద్దుటూరు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్‌గా వినోద్ కుమార్ నియామకం

కష్టపడిన కార్యకర్తకు దక్కిన గుర్తింపు: ప్రొద్దుటూరు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్‌గా వినోద్ కుమార్ నియామకం

తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనంగా పార్టీ కడప జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ఇ. వినోద్ కుమార్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన అనేక అక్రమ కేసులను కోర్టులలో వాదించి వారికి అండగా నిలిచిన కృషిని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ప్రభుత్వం వినోద్ కుమార్‌ను ప్రొద్దుటూరు సివిల్ జడ్జెస్ కోర్టు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకంపై స్పందించిన వినోద్ కుమార్, పార్టీని నమ్ముకుని అంకితభావంతో పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సవిత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎండి. ఫరూక్, జోనల్ కోఆర్డినేటర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. భూపేష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా లీగల్ సెల్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని వేళలా తనకు పూర్తి అండగా నిలిచి, ఈ పదవి దక్కేందుకు విశేష కృషి చేసిన ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇంచార్జి డాక్టర్ జి. వీర ప్రవీణ్ రెడ్డికి వినోద్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






Comments