రూ. 1.48 కోట్ల విలువైన నకిలీ ధనియాల పౌడర్ స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

ప్రొద్దుటూరులో విజిలెన్స్ అధికారుల విస్తృత దాడులు: రూ. 1.48 కోట్ల విలువైన నకిలీ ధనియాల పౌడర్ స్వాధీనం

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మండి బజార్ రోడ్డులో ఉన్న ‘జ్యోతి & కంపెనీ’ పై కడప విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా భారీ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హానికరమైన విష రసాయనాలు కలిపి తయారు చేసిన సుమారు 1,93,540 కిలోల కృత్రిమ నకిలీ ధనియాల పౌడర్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ నిల్వల మొత్తం విలువ మార్కెట్లో సుమారు ₹1,48,22,470/- ఉంటుందని అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం స్టాక్‌ను సీజ్ చేసి తదుపరి పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించడమే కాకుండా, నకిలీ తయారీకి పాల్పడిన గాజులపల్లి రమేష్, గాజులపల్లి వినయ్‌లపై ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏవో జి. లక్ష్మణ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నకిలీ ఆహార పదార్థాలు తయారుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






Comments