top of page

రాయలసీమ వాస్తు రత్న కొర్రపాటి రవీంద్రనాథ్ కన్నుమూత: విషాదంలో వాస్తు రంగం

Writer: EDITOR
EDITOR
Aug 26
1 min read

రాయలసీమ వాస్తు రత్న కొర్రపాటి రవీంద్రనాథ్ కన్నుమూత: విషాదంలో వాస్తు రంగం

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వాస్తు నిపుణుడిగా విశేష గుర్తింపు పొందిన 'రాయలసీమ వాస్తు రత్న' కొర్రపాటి రవీంద్రనాథ్ (72) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ఆయన, సుమారు నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలియడంతో స్వగ్రామమైన కొర్రపాడుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.


వాస్తు రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న వాస్తు రవి... అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిపుణుడిగా ఎదిగారు. అనేకమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు మరియు కార్యాలయాల నిర్మాణాల కోసం ఆయన వద్ద వాస్తు సలహాలు తీసుకునేవారు. ఆయన ఆకస్మిక మృతితో గ్రామస్థులు, బంధుమిత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేయగా, వాస్తు రంగంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page