top of page

రానున్న స్థానిక ఎన్నికలే 2029 సార్వత్రిక పోరుకు నాంది - వైఎస్సార్‌సీపీ

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
2 days ago
1 min read

రానున్న స్థానిక ఎన్నికలే 2029 సార్వత్రిక పోరుకు నాంది: కడప వైఎస్సార్‌సీపీ సమావేశంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ

కడప పట్టణంలోని కడప కన్వెన్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే 2029 సార్వత్రిక ఎన్నికల గెలుపును నిర్ణయించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారని, స్థానిక నాయకత్వం కూడా అదే మొక్కవోని ధైర్యంతో పనిచేసి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా క్షేత్రస్థాయి కార్యకర్తలకు నాయకత్వం కొండంత అండగా ఉంటుందని, ప్రతి ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడాలని స్పష్టం చేశారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ కమిటీ కార్డు కలిగిన విశ్వసనీయమైన నాయకులు, కార్యకర్తలకే టికెట్లు కేటాయించాలని రాచమల్లు తేల్చిచెప్పారు. గెలిచిన తర్వాత పార్టీ మారే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని హెచ్చరిస్తూ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వార్డు సభ్యుడి నుంచి మున్సిపల్ ఛైర్మన్ వరకు అన్ని పదవులకు పార్టీ కమిటీ కార్డు ఉన్నవారికే టికెట్లు దక్కేలా చూస్తామని ప్రకటించారు. అధికార యంత్రాంగం, పోలీసులతో పోరాటం చేసైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చేందుకు తాను రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని జిల్లా అధ్యక్షుడి సమక్షంలో పేర్కొన్నారు. పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ వేదికపై నుంచి పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఉద్ఘాటించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page