top of page

క్షణికావేశం రెండు ప్రాణాలు బలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 5, 2022
  • 1 min read

క్షణికావేశం రెండు ప్రాణాలను బలితీసుకోగా, ఇరువురికి తల్లిదండ్రులను దూరం చేసింది.


మద్యం మత్తులో భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ ఏజెన్సీలో చోటుచేసుకుంది.

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ, రామారావుపాలెం గ్రామానికి చెందిన గెమ్మెలి గణపతి, తులసి భార్యాభర్తలు. సోమవారం రాత్రి భార్యా భర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనితో మద్యం మత్తులో ఉన్న గణపతి కత్తితో తన భార్య తులసి పీక కోసేశాడు. తులసి అక్కడికక్కడే మృతి చెందగా, మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు అన్నవరం పోలీస్ లకు సమాచారమందించారు. దీనితో పోలీసులు తనను శిక్షిస్తారనే భయంతో భర్త అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. గ్రామస్తులు లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో గణపతి మృతి చెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు. తాగుడు వ్యసనం అభంశుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేసింది. ఎస్ఐ ఎన్.ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page