ప్రొద్దుటూరులో విషాదం... వినాయక నిమజ్జనంలో కరెంట్ షాక్ తగిలి యువకునికి తీవ్ర గాయాలు

Sep 20
1 min read
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం: వినాయక నిమజ్జనంలో కరెంట్ షాక్ తగిలి పాలిటెక్నిక్ విద్యార్థికి తీవ్ర గాయాలు


కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ వీధిలో వినాయక నిమజ్జనం వేడుకల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా సెకండియర్ చదువుతున్న సందీప్ అనే విద్యార్థి, విగ్రహం వద్ద ఉన్న ప్లగ్ బాక్స్ బోర్డును అనుకోకుండా తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సందీప్‌ను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుట్టినరోజు నాడే సందీప్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.




Comments