top of page

శ్రీవారి మాల ధరించిన భక్తులకు అన్నదానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 23, 2023
  • 1 min read

శ్రీవారి మాల ధరించిన భక్తులకు అన్నదానం

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవారి భక్తులు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


కర్నూలుకు చెందిన శ్రీ భక్త చైతన్య మహా పాదయాత్ర గత అయిదు రోజుల క్రితం ప్రారంభమై గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతి లోకి అడుగిడగా, ఎంవిఆర్ ఆర్టిపిపి కి చెందిన గోపాల్ రెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, వెంకటేశ్వర స్వామి మాల ధరించిన దాదాపు 500 వందల మంది భక్తులకు కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం వెలుపల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా కర్నూలు నుండి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న వెంకటేశ్వర స్వామి మాలధారులకు గోపాల్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నారని, వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరి పై ప్రసరించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, స్వామి మాల ధరించిన భక్తులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page