top of page

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 29, 2023
  • 1 min read

వీకెండ్ రానే వచ్చేసింది..

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

వీకెండ్ వచ్చేసింది. నేడు (శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు..

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 69,378 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,371 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page