top of page

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ

Writer: EDITOR
EDITOR
Jul 5, 2023
1 min read

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 76,254 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page