top of page

ట్రాక్టర్ను ఢీకొన్న టిప్పర్ వ్యక్తి మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 18, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు ద్వారకా నగర్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే బి.కోడూరు మండలం గుంతపల్లె గ్రామానికి చెందిన 58 సంవత్సరాల సుబ్బారెడ్డి తాను గత కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన ట్రాక్టర్ మరమ్మత్తుల పనులు, ఆర్టీవో కార్యాలయం నందు రిజిస్ట్రేషన్ కొరకు ప్రొద్దుటూరుకు చేరుకొని, పనులు ముగించుకొన్న తరువాత ప్రొద్దుటూరులో నివాసముంటున్న తన కూతురు కుటుంబాన్ని పరామర్శించేందుకు ట్రాక్టర్లో బయలుదేరిన సుబ్బారెడ్డికి మృత్యు టిప్పర్ రూపేనా అతనిని పలకరించింది. ద్వారకా నగర్ మలుపు వద్ద తాను ట్రాక్టర్ ను మలుపు తీసుకుంటుండగా ఏపీ 21 టిఏ 1726 నంబరు గల టిప్పరు మట్టిలోడుతో అతివేగముగా వచ్చి సుబ్బారెడ్డి ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెంది తల భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగా టిప్పర్ ఢీ కొన్న ట్రాక్టర్ను దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకొని వెళ్లి ఆగింది, కాగా టిప్పర్ డ్రైవరు రురల్ పోలీసు స్టేషన్ నందు లొంగిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page