top of page

తొగటవీర క్షత్రియ విద్యార్థుల ప్రతిభకు పురస్కారాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 22, 2024
  • 1 min read

తొగటవీర క్షత్రియ విద్యార్థుల ప్రతిభకు పురస్కారాలు

సమావేశంలో పాల్గొన్న సంఘ నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రతిభగల తోగటవీర క్షత్రియ విద్యార్థిని విద్యార్థులకు, ప్రొద్దుటూరు తోగటవీర క్షత్రియ ఉద్యోగులు మరియు వృత్తి నిపుణుల సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 2023 - 24 సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల యందు ఉత్తమ ప్రతిభ కనబరచిన గవర్నమెంట్, జడ్పీ హైస్కూల్, మున్సిపల్ స్కూల్ లలోని విద్యార్థినీ విద్యార్థినులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు జూన్ 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు వారి సేవా సంఘ కార్యాలయం నందు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు, కావున పదవ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు వసంతపేటలోని సంఘ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవలసిందిగా సేవా సంఘం అధ్యక్షులు ఈడెం లక్ష్మీనారాయణ ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో అసిస్టెంట్ సెక్రటరీ పల్లా శివ నాగయ్య, వైస్ చైర్మన్ బొలిశెట్టి శ్రీను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు హరి, గోవిందు రామ మునయ్య తదితరులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page