top of page

36 వ వార్డు బురుజుపేట సచివాలయం లో చోరీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 1, 2022
  • 1 min read

విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర వార్త, 36 వ వార్డు బురుజుపేట సచివాలయం లో చోరీ

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న విశాఖ ప్రజల మీదే కాకుండా సచివాలయాల పైన కూడా దొంగలు దృష్టి సాధించి దొంగతనాలు చేయడం జరుగుతుంది.


వివరాల్లోకి వెళితే... విశాఖ జీవీఎంసీ 36 వ వార్డు బురుజుపేట సచివాలయం గుర్తుతెలియని వ్యక్తులు లో చోరీ కి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి సచివాలయం శానిటేషన్ కార్యదర్శి ఎల్లారావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం విధులు ముగించుకున్న సచివాలయ సిబ్బంది సచివాలయానికి తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే బుధవారం సచివాలయం తెరిచేందుకు అక్కడకు వచ్చిన సిబ్బంది సచివాలయం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. దీంతో శానిటేషన్ విభాగానికి చెందిన సుమారు 20 వేల రూపాయల నగదు గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. విశాఖ పోలీసులు దీనిపై సమగ్ర సర్వే చేస్తామని తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page