top of page

నగదు, బంగారం చోరీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 19, 2023
  • 1 min read

ప్రొద్దుటూరులో దొంగతనం నగదు, బంగారం చోరీ

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా గల వ్యాపార సముదాయం నందు సోమవారం రాత్రి దొంగతనం చోటుచేసుకుంది. దాదాపు 5 లక్షల రూపాయల నగదు, మూడు తులాల బంగారు చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే బైసాని సుబ్రహ్మణ్యం పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా నిర్వహిస్తున్న చిల్లర దుకాణం, హోటల్ నందు ఐదు లక్షల రూపాయల నగదు మూడు తులాల బంగారు చోరీకి గురైందని వాపోయారు. తాను తమ కుటుంబ సభ్యులు వినాయక చవితి సందర్భంగా గోకుల్ నగర్ నందు ఏర్పాటు చేసిన గణేశ మంటపం వద్దకు వెళ్ళగా, హోటల్లోని వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించి, షాపులో తాము ఏర్పాటు చేసుకున్న గణేశుని ప్రతిమ వద్ద పూజకు ఉంచిన 2 లక్షల రూపాయల నగదు, అలాగే క్యాష్ బాక్స్ లో దాచి ఉంచిన తాళాలతో బీరువాలోని మరో మూడు లక్షల రూపాయల పైగా నగదు, మూడు తులాల బంగారు దొంగతనం చేసినట్లు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page