top of page

వరద ఆధ్వర్యంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 29, 2024
  • 1 min read

వరద ఆధ్వర్యంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణుల నడుమ నెహ్రు రోడ్డులోని టిడిపి కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరద టిడిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరద మాట్లాడుతూ, పార్టీ స్థాపించిన ఆది కాలంలోనే టిడిపి అధికారంలోకి వచ్చిందని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శిలు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్, మాజీ పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు, యువ నాయకులు కొండారెడ్డి, బచ్చల ప్రతాప్, మైనారిటీ నాయకులు ఖలీల్, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page