top of page

వడ్డీతో సహా చెల్లిస్తాం - టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 11, 2022
  • 1 min read

వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపాడు మండలం అయ్యవారి పల్లి గ్రామ సర్పంచ్ రహంతుల్లా కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాహ్ అహ్మద్ పరామర్శించారు. వైసీపీ నాయకులు గుండాల్లా తయారవుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన వైసీపీ, ఇప్పుడు చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వారి పై చిన్న కేసులు పెట్టి పోలీసులు మైనారిటీలను అవహేళన చేస్తున్నారని ముస్తాహ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page