top of page

108 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న సారథి నాయుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 15, 2024
  • 1 min read

108 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న సారథి నాయుడు

టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్న టిడిపి శ్రేణులు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


కూటమి విజయం సాధించడంతో పెన్నా నది తీరంలో వెలసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నందు 108 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న టీడీపీ యువ నాయకులు సారధి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అలాగే అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నాయుడు అఖండమైన మెజార్టీతో గెలవడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన నాయకులు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి వర్షాలు కురవాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సారథి నాయుడు, చరణ్ నాయుడు, జయ నాయుడు, మధుసూదన్ నాయుడు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page