top of page

చిట్వేలి లో మోత మోగిద్దాం నిరసన కార్యక్రమం.

Writer: DORA SWAMY
DORA SWAMY
Sep 30, 2023
1 min read

చిట్వేలి లో మోత మోగిద్దాం టిడిపి నిరసన కార్యక్రమం.

టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ నారా బ్రాహ్మణి పిలుపుమేరకు "మోత మోగిద్దాం ముఖ్యమంత్రికి వినబడేటట్టు" కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం తుమ్మ చెట్ల పల్లి కందులవారిపల్లి సదరు గ్రామ ప్రజలకు చేపట్టగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు.

టిడిపి యువ నాయకులు కాకర్ల నాగార్జున తదితరులుమాట్లాడుతూ.... 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచడం కేవలం కక్షపూరిత చర్యనని అన్నారు. అక్రమార్కులకు అధికారం ఇస్తే మంచి వారు జైలు పాలు కావడం అంటే ఇదేనేమో అంటూ ఆశ్చర్య వ్యక్తం చేశారు. చేసిన తప్పు తెలుసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల లారీ సుబ్బరాయుడు రామాంజనేయులు టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page