ప్రొద్దుటూరులో నేటి నుంచి 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం
- VOICE OF HERALD

- Jul 27
- 1 min read
ప్రొద్దుటూరులో నేటి నుంచి 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర టిడిపి ఆదేశాల మేరకు నేటి నుంచి 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం ఏపీలో నేటి (సోమవారం) నుంచి 45 రోజుల పాటు 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, సూపర్-6 హామీలు, లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వివరిస్తారని టీడీపీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీ బూత్ నెంబర్ 224 నందు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందున్నాయా లేదా, అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా అని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి భావన, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి.
కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, పలువురు టిడిపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.





Comments