top of page

రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక: ‘టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం’

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Aug 31
1 min read

రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక: ‘టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం’

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకుడు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడుతుంటే రాచమల్లు జీర్ణించుకోలేక బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. "టీడీపీ నాయకుల నాలుక కోస్తా" అంటూ రాచమల్లు చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో అదే రీతిలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పట్టణ అధ్యక్షుడు, బీసీ నాయకుడైన చల్ల రాజగోపాల్ యాదవ్‌పై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, గతంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను బెదిరించినట్లే ఇప్పుడు కూడా బీసీల ఎదుగుదలను రాచమల్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు.


గతంలో రిజిస్టర్ కార్యాలయం వద్ద తన ఆస్తి రూ.100 కోట్లు అని ప్రకటించిన రాచమల్లు, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, నాడు-నేడు ఆయన ఆస్తులపై లెక్కలు తేలాల్సి ఉందని డిమాండ్ చేశారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా తన హయాంలోనే కార్పొరేట్ మాల్స్‌ను అనుమతించిన విషయం వ్యాపారులు గమనించాలని సూచించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి కోవర్టులను పంపుతూ నాటకాలు ఆడుతున్నారని, ప్రొద్దుటూరులో రాచమల్లు ఆడుతున్న రాజకీయ నాటకాలకు త్వరలోనే టీడీపీ తెరదించుతుందని స్పష్టం చేశారు. టీడీపీలోని సామాన్య కార్యకర్తను కూడా ఎవరూ ఏమీ చేయలేరని, పార్టీ శ్రేణులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page