top of page

టిడిపిలోకి నూతన చేరికలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 18, 2024
  • 1 min read

టిడిపిలోకి నూతన చేరికలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద నగర్ నందు టిడిపి యువ నాయకులు బత్తల సుమంత్, లారీ గంగాధర్ ల ఆధ్వర్యంలో టిడిపిలోకి నూతన చేరికలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా నంద్యాల రాఘవరెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్ర రెడ్డి వివేకానంద కాలనీలోని పలువురిని టిడిపిలోకి కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ ఎంపీటీసీ తిప్పిరెడ్డిపల్లె నడిపి దస్తగిరి ఆయన అనుచరులు పలువురు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల రాఘవరెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి పార్టీలో చేరే వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్నది అటు నియోజకవర్గంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టిడిపి ప్రభుత్వమేనని, సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, విజన్ గల నాయకుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి పాలన అంతమవుతుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బద్వేల్ వాసు, చిలకల కృష్ణారెడ్డి, వెళ్లాల భాస్కర్, సాకం నాగేశ్వర్ రెడ్డి, నంగనూరు పల్లె నగేష్, కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్, మునీర్ తదితరులు పాల్గొనగా, పార్టీలో చేరిన వారిలో జింక రమణమూర్తి, చిన్న దస్తగిరి, కిషోర్, మునయ్య, కె రాజా, రాము, చిన్నగిరి, చిన్నప్ప, లక్ష్మణ్, చిన్న దస్తగిరి, శీను, సుధాకర్, బషీర్, నారాయణ ఆచారి, బాలచంద్ర, సునీల్, తదితరులు ఉన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page