top of page

చంద్రబాబుకు మద్దతుగా చిట్వేలి టిడిపి నాయకుల నిరసన.

Writer: DORA SWAMY
DORA SWAMY
Oct 24, 2023
1 min read

చంద్రబాబుకు మద్దతుగా చిట్వేలి టిడిపి నాయకుల నిరసన.

సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు.

మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ పిలుపుతో విజయదశమి పర్వదినాన మంగళవారం చిట్వేలి మండల పరిధిలోని సి. కందుల వారి పల్లి లో బాలు రామాంజనేయులు, కాకర్ల లారీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నిరసన చేస్తూ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

యువ నాయకులు కాకర్ల నాగార్జున మాట్లాడుతూ..

వచ్చే విజయదశమికి రాష్ట్రమంతా చంద్రన్న వెలుగులు ప్రకాశించాలని,నియంత పాలన నశించాలని వారు తెలిపారు. సైకో పోవాలి అన్న ప్రతులను అందరికీ పంచి తదుపరి దహనం చేశారు.


ఈ కార్యక్రమం లో తెలుగు దేశం నాయకులు బాలు రెడ్డయ్య, కాకర్ల నాగార్జున, కాకర్ల కోటేశ్వరరావు, కట్టా జయకృష్ణ, ప్రణయ్, ప్రభాకర్ పెద్ద ఎత్తున గ్రామస్తులు, మహిళలు పాల్గున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page