top of page

చలో కడప చేపట్టిన ప్రొద్దుటూరు టీడీపీ నేతలు అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 10, 2022
  • 1 min read

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆదేశాల మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, జాబ్ క్యాలండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడి లో భాగంగా, కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో కడపకు వాహనాల్లో వెళుతున్న తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, పార్లమెంటు కార్యదర్శి యమ్మనూరు ఆంజనేయులును ప్రొద్దుటూరు 3 TOWN CI ఆనందరావు, చాపాడు SI సుబ్బారావు మైదుకూరు లో అరెస్ట్ చేసి చాపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా అరెస్ట్ లు చేయడం దారుణం అని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయకపోవడం లో ప్రాంహుత్వం విఫలం అయ్యిందన్నారు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోవడం దారుణం అని ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసినా నిరుద్యోగ యువత సమస్యల పై నిరంతరం తెలుగుదేశం పార్టీ వై.సి.పి ప్రభుత్వం పై పోరాడుతూనే ఉంటుంది అని ఆయన హితువు పలికారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page