top of page

గుంటూరులో టీడీపీ నేత హత్య, ఖండించిన నారా లోకేష్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 13, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధి వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ

గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య ను ప్రత్యర్ధులు దారుణంగా నరికి చంపటంలో ఒక్కసారిగా గ్రామంలోను అటు టీడీపీ వర్గాలలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి, వివరాల్లోకి వెళితే చంద్రయ్య గ్రామంలోని ఒక సెంటర్ వద్ద కూర్చొని ఉండగా ప్రత్యర్ధులు ఇదే అదునుగా భావించి హత్యాయత్నానికి పూనుకున్నట్లుగా తెలుస్తోంది, హత్యోదంతం ముగియగానే నింధితులు పరారయ్యారు, సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుఠాహుటిన సంఘఠన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వద్దీనపరచుకొని, హత్యకు గల కారణాలపై ఆరా తీశారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ హత్యను ఖండించారు వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువ అయ్యాయని, ప్రతిపక్షాలకు రక్షణ కరువు అయ్యిందని, ప్రశ్నించే గొంతులను పోరాడే వారిని అంతమొందించటం పరిపాటిగా మారిందని, ఈ హత్యకు కారకులయిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, చంద్రయ్య కుటుంబానికి టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page