top of page

ఘనంగా టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jan 25, 2024
1 min read

ఘనంగా టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ప్రవీణ్ రెడ్డి ని గజమాలతో సన్మానిస్తున్న అభిమానులు
భారీ కేక్ కట్ చేస్తున్న ప్రవీణ్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గురువారం ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో, ప్రొద్దుటూరు లోని ఆయన నివాసం వద్ద పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రవీణ్ రెడ్డి అభిమానులు తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదానం నిర్వహించి, గజమాలతో ఆయనను సత్కరించి, 41 కేజీల భారీ కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, ఎన్నికలలో ప్రొద్దుటూరులో తమ సత్తా చాటుతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రవీణ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page