top of page

రాజుపాలెంలో టిడిపి ఎన్నికల ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 17, 2024
  • 1 min read

రాజుపాలెంలో టిడిపి ఎన్నికల ప్రచారం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం రాజుపాలెం మండల గ్రామమైన రాజుపాలెం నందు బూతూరు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి రాజుపాలెం గ్రామం నందు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను వివరించి, రానున్న ఎన్నికలలో టీడీపీ కడప పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి, అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న నంద్యాల వరదరాజుల రెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల నాయకులు కృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, శివారెడ్డి, మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వర్ రెడ్డి, వి.ఎస్ ముక్తియార్, పలువురు ముఖ్య టిడిపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, రాజుపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page