top of page

ఈశ్వర్ రెడ్డి నగర్ లో టిడిపి మమ్ముర ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 17, 2024
  • 1 min read

కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్ లో టిడిపి మమ్ముర ప్రచారం

కడప జిల్లా, పొద్దుటూరు నియోజకవర్గ సోమలవారి పల్లె పంచాయతీ పరిధిలోని ఈశ్వరరెడ్డి నగర్ 8, 9, 10, వార్డు నందు బుధవారం ఉదయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన టీడీపీ నాయకులను ఈశ్వర్ రెడ్డి నగర ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఈశ్వర్ రెడ్డి నగర్ నందు ప్రతి గడప తిరుగుతూ, టిడిపి ప్రభుత్వ మేనిఫెస్టో సూపర్ సిక్స్ లను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఐదవ వార్డు కౌన్సిలర్ మురళి, 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, టీడీపీ నాయకులు బద్వేలు శ్రీనివాసరెడ్డి, పల్లేటి రాముడు, సాంబశివుడు, పగడాల సుబ్బారెడ్డి, గంగాధర్, రామచంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, చలమయ్య, ఖాసీం, షామీర్, షరీఫ్ కవి, వార్డులోని టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page