top of page

సోమాపురం, అర్కటవేముల గ్రామాలలో టిడిపి ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 14, 2024
  • 1 min read

సోమాపురం, అర్కటవేముల గ్రామాలలో టిడిపి ప్రచారం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాజుపాలెం మండలం పరిధిలోని అర్కటవేముల, సోమాపురం గ్రామాలలో ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమాపురం గ్రామం నందు సర్పంచ్ యత్తపు ప్రభావతి, యత్తపు వెంకటసుబ్బయ్య యాదవ్ ల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అర్కటవేముల గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ సభను ఉద్దేశించి వరద మాట్లాడుతూ, టిడిపి ప్రభుత్వ హయాంలో బీసీలకు వెన్ను దన్నుగా నిలిచిన ప్రభుత్వం తమదేనని, రానున్న ఎన్నికలలో బీసీలందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో తెదేపా మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రామచంద్రారెడ్డి, చెమికెల పురుషోత్తం రెడ్డి, ఉపసర్పంచ్ గంగాధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ డి. చంద్ర నరసింహులు, ఓబులరెడ్డి, దిద్దికుంట వేమ నారాయణ, వెంకటసుబ్బన్న, ఓపన్న, గడ్డం వెంకటసుబ్బారెడ్డి, చదిపిరాల్ల వేణుగోపాల్ రెడ్డి, చదిపిరాల్ల రామ్మోహన్ రెడ్డి, టిడిపి నాయకులు వి ఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్ రెడ్డి, చల్లా రాజగోపాల్ యాదవ్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page