బొల్లవరంలో టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం
- VOICE OF HERALD

- Apr 3, 2024
- 1 min read
బొల్లవరంలో టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం


కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి నేడు మునిసిపల్ ఒకటో వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేలా చర్యలు చేపడతామని భుపేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏనాడు ప్రజల సమస్యలపై స్పందించలేదని, తాను రాబోవు కాలంలో ప్రజలతో కలిసి వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి తెలిపారు.








Comments