top of page

జాతీయస్థాయి సిలబం పోటీల్లో ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 28, 2023
  • 1 min read

జాతీయస్థాయి సిలబం పోటీల్లో ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ

పతకాలు సాధించిన క్రీడాకారులతో మాస్టర్లు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఇటీవల తమిళనాడులోని రాజాయపాలెం పట్టణంలో నిర్వహించిన 19వ జాతీయస్థాయి సిలబం (కర్రసాము) పోటీలలో రాజంపేట పట్టణానికి చెందిన ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారని మాస్టర్లు ఉద్దండపు బాలాజీ గణేష్, రెడ్డి ప్రవీణ్ లు తెలియజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో రాజంపేట పట్టణం నుంచి మొత్తం నలుగురు విద్యార్థులు పాల్గొనగా అందులో రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించారని తెలిపారు. మినీ సబ్ జూనియర్స్ విభాగంలో డి.సహస్వి, సి.రుత్వికా రెడ్డి రజత పతకాలు.. జూనియర్ విభాగంలో వై.గంగాధర కాంస్య పథకం సాధించారని అన్నారు. భారతదేశ సంప్రదాయ కళ ఐన సిలంబం (కర్రసాము) లో విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం పట్ల రాజంపేట వాసులు హర్షం వ్యక్తం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page