top of page

12 మంది విద్యార్థినీ విద్యార్థులు TCS నందు ఎంపిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 24
  • 1 min read

SVDC అటానమస్, 12 మంది విద్యార్థినీ విద్యార్థులు TCS నందు ఎంపిక

ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థిని విద్యార్థులతో కళాశాల కరస్పడెంట్ హరినారాయణ
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థిని విద్యార్థులతో కళాశాల కరస్పడెంట్ హరినారాయణ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు, స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అటానమస్, నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు 12 మందికి టిసిఎస్ నందు కొలువుకు ఎంపిక కావడం జరిగింది . డిగ్రీ చదివే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగ అవకాశంతోనే సమాజంలోకి వెళ్లాలి అనే లక్ష్యంతో దేశ్పాండే స్కిల్ ఎడ్యుకేషన్ వారితో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వివిధ ఐటీ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకు ఇంటర్వ్యూలకు రిటన్ టెస్ట్ లకు అటెండ్ కావడం జరిగింది. ఇందులో భాగంగా టిసిఎస్ నందు 12 మంది సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది అని కళాశాల కరస్పాండెంట్ అరకట వేముల హరి నారాయణ తెలియజేయడం జరిగింది. డిగ్రీ తో పాటు జాబ్ లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రాంలో విజేతలుగా నిలిచిన వీళ్ళందరికీ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం అభినందనలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page