వై వి యు డిగ్రీ ఫలితాలలో ఎస్విడిసి విద్యార్థులకు మొదటి ర్యాంకు
- VOICE OF HERALD

- Aug 4
- 1 min read
వై వి యు డిగ్రీ ఫలితాలలో ఎస్విడిసి విద్యార్థులకు మొదటి ర్యాంకు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వై.వి.యు డిగ్రీ నాలుగవ సెమిస్టర్ ఫలితాలలో ప్రొద్దుటూరు స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల తమ ప్రతిభ కనపరిచి యూనివర్సిటీ పరిధిలో మొదటి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. బీఎస్సీ హానర్స్ జువాలాజీ విభాగంలో ఎస్ సాహే ముస్కాన్, ఎస్ సుహానా, టీఎస్ సబీరా అను విద్యార్థినులకు పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించారని యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారని కళాశాల కరెస్పాండెంట్ ఎ. హరి నారాయణ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. అలాగే నాలుగో సెమిస్టర్ బీఎస్సీ జువాలజీ విభాగంలో ఎస్ గౌసియా, ఎం సుప్రియ 9.85, యు బాలాజీ, రిషిత వైష్ణవి లు 9.7, వేరోనికా 9.5, అప్సర్ 9.10, ఎన్ఎస్ సుహానా 9.1, బీఎస్సీ బయోటెక్నాలజీ విభాగంలో అరాస్ 9.4, బ్లేస్సి, శ్వేత 9.25, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగం నందు పవిత్ర, దీవెన 9.3, సాదియా 9.1, కే వర్ధన్ యాదవ్ 9 గ్రేడ్ పాయింట్లు సాధించారన్నారు. అలాగే బీబీఏ విభాగంలో బి లక్ష్మీ ప్రవల్లిక 9.6, జి గురు సౌమ్య 9.2, ఎస్ ఫర్హాన్ 9.1, బీసీఏ విభాగంలో నాగవల్లిక 9.45, ఎస్ నాగ శ్వేత 9.35, ఎస్ అమీనా, యమునా 9.0 గ్రేడ్లు సాధించగా, బీకాం కంప్యూటర్స్ విభాగంలో వి ముని అర్షిత 9.35, ఎం మల్లీశ్వరి, వి విష్ణుప్రియ 9.1 సాధించారన్నారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల డైరెక్టర్ ఎ. పృథ్వి నారాయణ, వైస్ ప్రిన్సిపల్ శారదా భవాని, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్, హెచ్.ఓ.డి లు అజ్రా అజ్మత్, మౌనయ్య, గంగాభవాని, రెడ్డెమ్మ, డీన్ రాజీవ్ అలాగే అధ్యాపక అధ్యాపకేతర బృందం వారిని అభినందించారు.





Comments