top of page

టిసిఎస్ నందు కొలువు సాధించిన SVDC విద్యార్థిని విద్యార్థులను అభినందించిన ఏ ఎస్ పి విభూ కృష్ణ

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jul 20
1 min read

టిసిఎస్ నందు కొలువు సాధించిన SVDC విద్యార్థిని విద్యార్థులను అభినందించిన ఏ ఎస్ పి విభూ కృష్ణ

స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గలా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు ఈరోజు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కాలేజీలో టిసిఎస్ సంస్థ నందు కొలువు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.  అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్సీసీ నందు సి సర్టిఫికెట్ సాధించిన ఎన్సిసి కాడేట్స్ కు వారి యొక్క సి సర్టిఫికెట్ను కూడా ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇంకా కళాశాలలో బీసీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సొంతంగా ఒక యాప్ను విద్యార్థిని విద్యార్థుల కొరకు తయారుచేయగా దాన్ని కూడా ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో పిల్లలను ఉద్దేశించి విద్యార్థుల భవిష్యత్తుకు క్రమశిక్షణ మంచిగా చదువుకోవడం ఎంతగానో ఉపయోగపడతాయి దానికి తోడుగా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటేనే ఈ రోజుల్లో రాణించగలరని ఆదర్శనీయంగా ప్రతి ఒక్కరికి ఉండేలా మన గెలుపు ఉండాలని ఆయన తెలియజేశారు. వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ద్వారా మా విద్యార్థిని విద్యార్థులు వివిధ కంపెనీలలో ఇప్పటికే సుమారుగా 134 మంది ఈ సంవత్సరం సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ అరకట వేముల పృధ్వి నారాయణ మాట్లాడుతూ, ఒక కంపెనీ నందు జాబ్ తెచ్చుకోవడానికి స్కిల్ ప్రజెంటేషన్ చాలా అవసరం అది లేకపోతే మనం ఏం చేస్తున్నాం ఏం చెప్తున్నామనేది కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం ,కాబట్టి వాటిని దాటుకొని మా విద్యార్థిని విద్యార్థులు వివిధ కంపెనీలలో సెలెక్ట్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ పర్లపాడు గౌరీ శంకర్ మాట్లాడుతూ మా కళాశాల క్యాప్షన్ అది ,యాడింగ్ పవర్ టు ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు పవర్ ఆడ్ చేయడం వల్ల ఉద్యోగం సాధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శారద భవాని మరియు కళాశాల హెచ్ ఓ డి లు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page