top of page

సర్వే నంబర్లు ఇచ్చేందుకు ఆర్మీ ఉద్యోగి వద్ద సర్వేయర్ లంచం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 15, 2023
  • 1 min read

సర్వే నంబర్లు ఇచ్చేందుకు ఆర్మీ ఉద్యోగి వద్ద సర్వేయర్ లంచం

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బసిన పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి పవన్ కుమార్ తన పొలం సంబంధిత సర్వే నంబర్లు సర్వే కోసం సర్వేయర్ రాజా బాబు ను సంప్రదించాడు.సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు 1500 రూపాయలు ఇస్తే కానీ ఇవ్వడం కుదరదని పవన్ కు రాజా బాబు తెలిపాడు. వెయ్యి రూపాయలు ఇచ్చేవరకు సర్వే రిపోర్ట్ ఇవ్వలేదని ఆర్మీ ఉద్యోగి పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ సేవ చేస్తున్న తమకే ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే మరియు సామాన్యుల పరిస్థితి ఏంటని ఆర్మీ ఉద్యోగి పవన్ కుమార్ అన్నారు. లంచగొండి అధికారులకు పై అధికారులు చెక్ పెట్టాలని పవన్ కుమార్ కోరుతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page