top of page

మహేశ్ బాబు కుటుంబంలో ఒకే ఏడాది రెండు విషాదాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 28, 2022
  • 1 min read

మహేశ్ బాబు కుటుంబంలో ఒకే ఏడాది రెండు విషాదాలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్, రమేష్, మంజుల, ప్రియుదర్శిని, పద్మావతి జన్మించారు. కాగా కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019 లో చనిపోయిన సంగతి తెలిసిందే.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page