top of page

రైలు పట్టాలపై పడుకొని యువకుడు ఆత్మహత్య యత్నం - సకాలంలో స్పందించిన పోలీసులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 1, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై అశోక్ (24) అనే యువకుడి ఆత్మహత్యా యత్నం. వాట్సాప్ లో సన్నిహితులకు 'ఆల్ మిస్ యూ ' అంటూ మెసేజ్.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో తక్షణం రంగంలోకి దిగి సిబ్బంది ని అప్రమత్తం చేసిన ఎస్.ఐ రవికుమార్..ఎస్.ఐ ఆదేశాల తో లొకేషన్ కు చేరుకొని యువకుడిని పట్టాలపై నుండి తప్పించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నరసింహ, హోంగార్డు డీజే ప్రసాద్..కౌన్సిలింగ్ నిర్వహించి యువకుడిని ఆత్మహత్యా యత్నం నుండి కాపాడిన సిబ్బంది..

సైబర్ సెల్ విభాగం ద్వారా లొకేషన్ గుర్తించి పట్టాలపై ఉన్న యువకుడిని కాపాడి యువకుడి తల్లిదండ్రులు, స్థానికుల మన్ననలు అందుకున్న పోలీసులు. యువకుడి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page