top of page

33 ఏళ్ల తర్వాత కలిసిన కల్లూరు Z.P పాఠశాల విద్యార్థులు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
6 days ago
1 min read

33 ఏళ్ల తర్వాత కలిసిన కల్లూరు Z.P పాఠశాల విద్యార్థులు

కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1993 - 1994 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు నేడు గండికోట పర్యాటక కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకొన్నారు. 33 సంవత్సరాల తర్వాత వారంతా ఇక్కడ కలుసుకొని, ఒకరినొకరు పలకరించుకొని, యోగక్షేమాలు విచారించుకున్నారు. గత స్మృతులను, పాఠశాల అనుభవాలను, తరగతి గదుల్లో జరిగిన సంఘటనలను, చదువు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకున్నారు. అలాగే అప్పటి 10వ తరగతి పాఠాలు నేర్పిన తెలుగు మాస్టారు రామలింగారెడ్డి, మాథ్స్ మాస్టారు యల్లారెడ్డి లను ఘనంగా సత్కరించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఇలా కలవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page